మాక్లూర్ మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో కుక్కర్ పెలి గాయల పాలైన కార్మికురాలికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని AITUC రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓమయ సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే నిర్వాహకురాలు లలితకు స్కూల్లో కుక్కర్ పెలి గాయాలపాలైందన్నారు. ప్రభుత్వం వెంటనే MDM కార్మికులకు ఇన్సూరెన్స్, ప్రమాద నష్టపరిహార బీమాను కల్పించాలన్నారు.