అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లేలి జంక్షన్ వద్ద నుండి సంఘం వలస వరకు మూడు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీడియో తీసి పాడేరు మీడియాకి చేరవేశారు. ఆయా ప్రదేశంలో మూడు కిలోమీటర్ల మేర గతంలో ఉండే రహదారి అస్తవ్యస్తంగా తయారైందని, రాకపోకలు చేసేందుకు తీవ్ర ఆశలు పడుతున్నామని, సంబంధిత శాఖల అధికారులు స్పందించి తారు రోడ్ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.