తురకపాలెంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు మండిపడ్డారు. ఆయన గుంటూరులో గురువారం మీడియాతో మాట్లాడుతూ క్వారీ నీళ్లను ప్రజలకు సరఫరా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలు స్వచ్ఛమైన నీటిని అమ్ముకుంటూ, తురకపాలెం ప్రజలు క్వారీ నీళ్లు తాగి చనిపోవాలా అని ప్రశ్నించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.