దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం సీతారాం పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారి ఏర్పాటు కు శాశ్వత షెడ్ నిర్మాణం కొరకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిదంగా మండలం లోని పుల్లూరు బండ చెర్ల పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శించుకున్నారు.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు...