కొయ్యూరు మండలంలోని డౌనూరు, తులబాడగెడ్డ సమీపంలో చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో శనివారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ బీ.శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. జేసీబీ వాహనం ఏర్పాటుచేసి రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించారు. రాకపోకలను పునరుద్ధరించామని సీఐ తెలిపారు.