విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం, స్థానిక మెహరా కాంప్లెక్స్ వద్ద గురువారం సాయంత్రం,సామర్లకోట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, బహీరాబాగ్ విద్యుత్ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభ అమలు చేసే విద్యుత్ సంస్కరణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.