పెన్షన్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. ఆగస్ట్ 1వ తేదీన జరగనున్న పెన్షన్ల పంపిణీపై బుధవారం ఉదయం 11గంటల సమయంలో ఆయన కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పెన్షన్ రూపేణా పంపిణీ చేయాల్సి ఉందన్నారు.