రాజన్న సిరిసిల్ల జిల్లా,తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ముద్రకోల లోకేష్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉపేంద్ర చారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ముద్రకొల లోకేష్ అనే యువకుడు గత కొద్ది రోజుల నుండి అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. నిన్నటి రోజు శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి భోజనం చేసి పడుకున్నాడు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్ర లేచి చూసేసరికి మృతుడు ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. మృత