నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జండా బాలాజీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జండా జాతర ఉత్సవాల పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. నిజాంబాద్ తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. మొదట స్వామి వారిని దర్శనం చేసుకుని జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో వేణు మాట్లాడుతూ.. జెండా ఉత్సవాలను ఈనెల ఏడవ తేది వరకు నిర్వహిస్తామని, అనంతరం పూలాంగు ప్రాంతంలో జెండాను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.