పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి స్కూటీ బోల్తా పడటంతో అంబుసోలి గ్రామానికి చెందిన కొమ్మల సత్య తో పాటు చీమల కల్పనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.