బీడీ కార్మికుల చదువుతున్న పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రోత్సాహక ఉపకార వేతనం తేదీ, ఆగస్టు 31 వరకు గడువు ముగిసిన, సెప్టెంబర్ 15 వరకు గడువును పొడిగించారని జగిత్యాల బీడీ కార్మికుల ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ జల్లా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విలేకరులకు వెల్లడించారు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు స్కూలు యజమాన్యాలు అందరి పిల్లలతో బీడీ స్కాలర్షిప్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఈ నెల 15వ తేదీ సెప్టెంబర్ 2025 చివరి తేదీగా పొడిగించినట్లు తెలియచేసి దరఖాస్తు చేసుకున్నట్లు అవగాహన కల్పించాలని సూచించారు.