అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో శ్రీదుర్గా ఉషోదయ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో డ్రైవర్లు చిత్రమందిర్ సెంటర్ నుంచి వైజంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫ్రీబస్సు పథకం అమలు చేయడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆటో డ్రైవర్లని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.