పామూరు: గణేష్ నిమజ్జోత్సవాలను అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పామూరు సిఐ భీమా నాయక్ సూచించారు. పామూరు పట్టణంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో కలిసి గణేష్ మండపాలను సిఐ పరిశీలించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా చిన్న పిల్లలు విగ్రహాల వెంట రాకుండా చూసుకోవాలన్నారు. మద్యం తాగి నిమజ్జనోత్సవం లో పాల్గొనవద్దని, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు చూసుకోవాలని సిఐ సూచించారు.