శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పరిగి రోడ్డులో గల కంచి కామాక్షి కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి వి. రత్న నిర్వహించారు ఈ సందర్భంగా SP మాట్లాడుతూ హిందూపురం ప్రజలు ఈసారి గణేష్ ఉత్సవాలను మరింత జాగ్రత్తగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ తర్వాత అంతే ఘనంగా గణేష్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం హిందూపురంలో ఉందన్నారు. గత ఏడాది హిందూపురంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పూర్తి ప్రమాద రహితంగా వేడుకలు నిర్వహించి కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని వివిధ సంఘాల