నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోటవురట్ల మండలం కైలాస పట్నం గ్రామంలో గత ఆదివారం జరిగిన బాణాసంచా కర్మాగార ప్రేలుడు ఘటనలో గాయపడీ గురువారం మృతి చెందిన జల్లూరు నాగరాజు కుటుంబానికి ప్రభుత్వాధికారులు, టీడీపీ నాయకులు శుక్రవారం 15 లక్షల ఆర్థిక సహాయం చెక్ అందజేశారు.