పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరు మైత్రి మైదానంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో కోకో, వాలీబాల్, కబడ్డీ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.