బషీర్బాగ్లోని విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్థూపం వద్ద వామపక్ష పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. విద్యుత్ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి త్యాగాలను వారు స్మరించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ జాతీయ నాయకురాలు పాశ్య పద్మ, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డితో సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.