బాపట్లలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే విద్యా కేంద్రంగా బాపట్ల మరింత మెరుగవుతుందని మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కాలేజీ నిర్మాణం చేపడతామని కూటమి నాయకులు చెప్పడం సరికాదన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్మాణం చేస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తే కోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వమే కళాశాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.