భారతి నగర్ డివిజన్ అభివృద్ధి పనులపై కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎల్‌ఐజి కాలనీలో డ్రైన్, మ్యాక్ సొసైటీ కాలనీలో కమ్యూనిటీ హాల్, ఈఎస్‌ఈ రోడ్‌లో చైన్ లింక్ మెష్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బొంబాయి కాలనీ రైతు బజార్, మల్టీపర్పస్ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.