చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం బోడెవారి పల్లి గ్రామంలో వ్యవసాయ పొలం వివాదంలో దాయాదులు గొడవపడ్డారు. ఈ గొడవలో మునస్వామి కుమారుడు హరినాథ్ 46 సంవత్సరాలు త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు హరినాథ్ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన గురువారం ఉదయం 11 గంటలకు వెలుగులో వచ్చింది.