వీ.కోట: మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రంగనాథ్ తెలిపిన సమాచారం మేరకు,రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హంద్రీనీవా జలాలు పుంగునూరు నియోజకవర్గం నుండి పెద్దపంజాణి,గంగవరం,బైరెడ్డిపల్లి మండలాలు దాటుకుని నేడు వీ.కోట కృష్ణాపురం కొడగల్ గ్రామాల మీదుగా హంద్రీనీవా జలాలు ప్రవేశించాయన్నారు. దీంతో పంప్ హౌస్ దగ్గర కృష్ణమ్మకు జల హారతులు చేపట్టి టెంకాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి మోటార్లను ఆన్ చేయడం జరిగిందన్నారు. హంద్రీనీవా జలాలు వీ.కోటలోకి ప్రవేశించడంతో ప్రజలు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.సీ.ఎం.కు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు.