సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం వాహనదారుల క్షేమమే కోరుతూ సామాజిక బాధ్యతను చాటుతూ ఆదర్శంగా నిలిచారు. సూర్యాపేటలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతల కారణంగా రోడ్డుపై వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. గుంతలమయంగా మారిన రోడ్లను డోజర్, ట్రాక్టర్ల సహాయంతో గుంతలను పూడ్చి వేస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు.