కడిగిరి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ సీఎం జగన్ ఆరా తీసినట్లు నారాయణ యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ వైసీపీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని, జగన్మోహన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా వైసిపిని కనిగిరి నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని నారాయణ యాదవ్ తెలిపారు.