మంచిర్యాల నగరపాలక సంస్థ ఇంజనీర్ గా ఎస్.రాజేందర్ బుధవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ కు ఇంజనీర్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు బాధ్యతలు చేపట్టగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ అభినందించారు.