కొయ్యూరు మండలంలోని చీడిపాలెం జంక్షన్ వద్ద 11.070 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్సై పీ.కిషోర్ వర్మ శనివారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న పీ.జోగేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనలో చేబ్రోలుకు చెందిన పవన కుమార్ పరారయ్యాడని తెలిపారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.