అనంతపురం పట్టణంలో ఈనెల పదవ తారీకు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు సంబంధించి పనులను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఆనందరావుతో కలసి పనులను పర్యవేక్షించారు. సభకు వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.