బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం తుమ్మలపల్లి సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గతరాత్రి యూరియా రావడంతో శనివారం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో కర్లపాలెం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత నడుమ యూరియా సరఫరా కొనసాగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడి ఎదురుచూడటం వింతగా ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.