నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో అనుమూల సుశీల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.