మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పెద్ద చెరువులో 25 ఏళ్ల రసూల్ అనే యువకుడు శుక్రవారం దుర్మరణం పాలయ్యాడు. చెరువులో ఒక వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెలికి తీశారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.