జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు అంజన్న ఆలయంలో బొడ్డెమ్మ సంబరం ఆరంభం అయింది, బొడ్డెమ్మను పుట్టమన్నుతో తయారుచేసి పూలతో అలంకరిస్తారు,కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం శనివారం 5:50 PM కి మహిళలు బొడ్డెమ్మ బతుకమ్మ ఆటపాటలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి,ఈనెల 21 నుండి పెద్దల అమావాస్య నుండి బతకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి,అలాగే ఆలయ పరిసరాల్లో బతుకమ్మ ఆడారు,అనంతరం చిరుతల భజన కీర్తనలు వికారాబాద్ జిల్లా ఎకంతల గ్రామానికి చెందిన హనుమాన్ భక్తమండలి స్వామి వారి భజన కీర్తనలు ఆలపిస్తూ ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది బొడ్డెమ్మ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి,