అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో జిల్లా స్థాయి 5కే మారథాన్ రెడ్ రన్ పరుగు పందేలు నిర్వహించామని జిల్లా కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.