కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని, శనివారం వేకువజాము నుండి సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వడ్డీ శ్రీనివాస్ తెలిపారు , ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2,93,822 రూపాయలు ఆలయం దేవస్థానానికి సమకూరుంది. భక్తులకు ఉదయం పులిహోర మధ్యాహ్నం, అన్న ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు.