అనకాపల్లి వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న చేపట్టనున్న రైతు పోరు పోస్టర్ ఆవిష్కరణ శనివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ ఆవిష్కరించారు. రైతులకు సరిపడ యూరియా అందించాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు భరత్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.