కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ ( ఆరొగ్య ఉప కేంద్రం ) ను మంగళవారం అకస్మిక తనిఖీ చేసినారు. ఇట్టి తనిఖీలో ఈ కేంద్రంలో అందుతున్న ఆరొగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో వసతులు మెరుగు పర్చాలని సుచించారు. నీటి సరఫరా వసతి కల్పించడానికి తగు ఏర్పాట్లు చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదెశించారు. ఆయుశ్మాన్ ఆరొగ్య మందిర్ లో రోజుకి ఎంత మంది రోగులు వస్తారు, ఎంత మంది గర్భిణీ లకు పరీక్షలు చేస్తున్నారు అని ఆరా తీశారు. గర్భిణీ పరీక్షల కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు