రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన పంపు కాడి నాగయ్య బుధవారం రోజున గల్లంతయ్యాడు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ నీటి పారుదల మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర ప్రాంతాలలో తనికి చేయా