నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, నాయకుని తండాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటకు గ్రామస్తులు ఆదివారం సాయంత్రం దేహశుద్ధి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకులు తండా గ్రామానికి చెందిన ఒక వివాహితతో అడవిదేవులపల్లి మండలం బాలాజీ తండా కు చెందిన రమేష్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు పలుమార్లు హెచ్చరించిన తీరు మారలేదు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మహిళా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని గ్రామస్తులతో కలిసి విద్యుత్ స్తంభానికి ఇద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు.