నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనా ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు పలు సూచన చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను విరమించుకోవాలని సూచిస్తున్నారు. మరో 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పురాతన భవనాలు ఉండొద్దని సూచనలు చేస్తున్నారు.