గంగవరం: మండలంలో రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షుడు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పూల చైతన్య మోహన్ తెలిపిన సమాచారం మేరకు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా గంగవరం మండలం, కీలపట్ల పంచాయతీ కీలపట్ల గ్రామంలో, ఉమారెడ్డెమ్మ ఉచిత నిత్య అన్నదాన సత్రం నందు త్రాగునీటి సమస్యను గుర్తించి కీర్తి శేషులు వేణుగోపాల్ నాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరపున పూల చైతన్య మోహన్ మరియు జనసేన నాయకుడు కార్యకర్తలు సమక్షంలో సుమారు రెండున్నర లక్షల విలువగల వాటర్ ప్లాంట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన సొసైటీ వారు అర్చకులచే వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం చేశారు.