కనిగిరి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాచవరం ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచవరంలోని ఎస్సీ కాలనీలో కుడుముల మరియమ్మ అనే వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మరియమ్మ సోదరుడు సాల్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ టి .శ్రీరామ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.