జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గత నెల 30 వ తేదిన జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్ లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సోమవారం రోజున మీడియాకు వెల్లడించారు. ధర్మపురి పట్టణానికి చెందిన కోలేటి మల్లిఖార్జున్ అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. దొంగతనం చేసిన వారి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి,దర్యాప్తు చేసినట్లు తెలిపారు.