సమాజంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడడమే పోలీస్ శాఖ యొక్క ముఖ్య విధులు అని పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షకీల్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచితంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. తాము ఎలాంటి పక్షపాతం లేకుండా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వివరించారు. కానీ తమ ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కష్టపడి రాత్రింబవళ్లు విధులు నిర్వహించామన్నారు.