సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పదిమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి మండలాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందని 15 మందికి 10 లక్షల 83 వేల 364 రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.