మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో యూరియా కొరతను తీర్చాలని కోరుతూ గురువారం ఉదయం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఊత్కూర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీ గా వెళ్ళి గాందీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుండి తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని తహసీల్దారు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు ఎగనామం పెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు.