పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ ఎంపీ క్యాంపు కార్యాలయంలో యువ బీజేపీ నాయకులు ధర్పల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకులను ఎంపీ పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన వినాయకుల ప్రతిమల వల్ల నీరు కలుషితమవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.