యోగివేమన విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్, ఆడిటోరియం, వెయిటింగ్ రూమ్ రిస్ట్ రూమ్ నిర్మాణాల శంకుస్థాపన శిలాఫలకాన్ని మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) రూ.10.5 కోట్లతో యోగివేమన విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల ప్రారంభ కార్యక్రమం యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మంత్రి హాజరై జ్యోతి ప్రజ్వలన, శిలా ఫలకం ప్రారంభించారు.