కామారెడ్డి పట్టణంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సిపిఎం రాష్ట్ర బృందం సందర్శించింది రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెంట సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు డీజే నరసింహారావు, ఆర్ వెంకట్ రాములు, శోభన్ నాయక్ లు పర్యటించారు. వీటితోపాటు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ బృందం ఉంది. ఇంటింటికి తిరిగి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అదే సందర్భంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ ను నిలదీశారు. కనీసం ప్రజలకు త్రాగడానికి మంచి నీళ్లు, ఆహారం, కరెంటు అందుబాటులోకి తేవాలని అన్నారు. వరదలో కొట్టుకొచ్చిన రాళ్లు రప్ప చెత్తాచెదారం ఇంట్లో చేరి బురదమయం అయ్యిందని అన్నారు. ఇంట్లోకి పాములు కూడా వచ్చాయని అన్నారు.