బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు పార్టీలో ఉన్న ఎవరైనా సరే సస్పెన్షన్ తప్పదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాలనుసారం ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలందరికీ ఇది వర్తిస్తుందని ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. MLC కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నో సేవలు అందించినప్పటికీ పార్టీ సిద్ధాంతాలకు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు.