ప్రజారోగ్యానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తోందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని 45 మంది అనారోగ్య పీడితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 49 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన శుక్రవారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ మరణించకూడదన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు తన రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్నారని చెప్పారు.