పరిపాలనలో విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ విఫలమయ్యారని ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ విమర్శించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మార్కులు ఇచ్చినట్లు విద్యార్థులు లోకేశ్ పాలనకి మార్కలు ఇస్తే 100కి 35 మార్కులు కూడా రావన్నారు. విద్యార్థులంతా ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. రెడ్ బుక్ పాలనపై కాకుండా విద్యార్థులకు అవసరాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.