మహబూబాబాద్ జిల్లా నరసింహుళపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కూపన్ల కోసం ఆదివారం మధ్యాహ్నం 12:00 లకు రైతులు ఎదురుచూస్తు పడిగాపులు కాస్తున్నారు..యూరియా టోకెన్ల కోసం రైతులు ప్రతి రోజు రైతు వేదిక వద్దకు వస్తున్నారు. టోకెన్ తీసుకున్న తర్వాత యూరియా కోసం మళ్లీ క్యూలో నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన పాత కూపన్లకే యూరియా అందలేదని రైతులు తెలిపారు. యూరియా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆరోపించారు